ట్రిపుల్ ఆర్ రెండో షెడ్యూల్ మొదలయింది

22 Jan,2019

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది ఆంగ్లేయుల పరిపాలనా కాలం నేపథ్యంలో రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా చరణ్ .. బందిపోటుగా ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఆ తరువాత రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం సందర్భంగా బ్రేక్ తీసుకున్నారు. తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను ఈ రోజున మొదలుపెడుతున్నారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంలో అభిమానులు కుతూహలంతో వున్నారు. విలన్ గా ఎవరు చేయనున్నారనే విషయం పట్ల ఆత్రుతను కనబరుస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేసిన సంగతి తెలిసిందే.

Recent News