సంక్రాంతి విడుదలైన 'పేట' తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. .ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో రజనీకాంత్ సరసన కీర్తిసురేష్‌ను హీరోయిన్‌గా నటింప చేస్తున్నారట. ఎ.ఆర్.మురుగదాస్ గత చిత్రం 'సర్కార్'లో కూడా కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించింది. ఆమెనే తలైవా సరసన నటింప చేయడానికి మురుగదాస్ ఆసక్తి చూపుతున్నాడని టాక్. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ఓ సినిమా చేస్తుంది.