సౌత్ క్రేజీ గర్ల్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది . . ఇప్పటికే మెగాస్టార్ సరసన సైరా సినిమాలో నటిస్తున్న ఆమె మరోసారి మెగాస్టార్ తో జోడి కట్టేందుకు రెడీ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సైరా మూవీ తర్వాత.. కొరటాల శివ సినిమా స్టార్ట్ చేస్తాడు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి కథ కథనాలు పూర్తయ్యాయి కానీ హీరోయిన్ మాత్రం ఫైనల్ అవ్వలేదు. ముందుగా కాజల్ ని అనుకున్నారు కానీ.. కాజల్ ఇప్పటికే ఖైదీ నెంబర్ 150లోనటించింది. ఆ తర్వాతి ఆప్షన్ నయనతారకే. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని - ఇంకా ఫైనల్ కాలేదనిటాక్.