కె ఎస్ 100 ట్రైలర్ విడుదల

21 Jan,2019

చంద్ర శేఖర్ మూవీస్ పతాకం పై సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, ఆశి రాయ్, శ్రద్ధ, అక్షత  ప్రధాన పాత్రదారులుగా
 కె. వెంకట్ రామ్ రెడ్డి నిర్మించిన చిత్రం 'కె ఎస్ 100'. షేర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ నిర్మాత సాయి వెంకట్, మల్టీ డీమెన్షన్ వాసు, అట్లూరి రామకృష్ణ లచే విడుదలైంది. ఈ సందర్భంగా మొదట నిర్మాత వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ ... మంచి హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ. సినిమా చాలా బాగొచ్చింది. అందరికీ నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా అన్నారు. 
హీరోయిన్ సునీత పాండే మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు.  ఇదివరకు భోజ్ పూరి, పంజాబి  సినిమాల్లో నటించాను. తెలుగులో ఇదే నా మొదటి సినిమా.. సౌత్ ఇండస్ట్రీ లో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా... ఇప్పటికి నెరవేరింది.  తెలుగు ఇండస్ట్రీ రియల్లీ వండర్ఫుల్. చాలా సపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో నా పాత్ర చాలా చాలెంజింగ్ గా ఉంటుంది.. వందశాతం న్యాయం చేశానని అనుకుంటున్నాను..  అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా, మ్యూజిక్ చాలా బాగొచ్చింది.   మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.  హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. యాక్టర్ అవ్వాలనే నా డ్రీమ్ నెరవేరింది. మంచి సబ్జెక్టు తో ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. షేర్ గారు మాకెంతో సపోర్ట్ ను అందించారు. ప్రూవ్  చేసుకునే పాత్ర నాకు అందించినందుకు ఆయన నా స్పెషల్ థాంక్స్. టీమ్ అంతా  హార్డ్ వర్క్ చేసాము.. మరిన్ని మంచి సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటున్నా.  తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అని తెలిపారు. దర్శకుడు  షేర్ మాట్లాడుతూ.. నా పేరు షిరాజ్.. కానీ ఎవరికీ పలకడం రావడం లేదనే షేర్ అని మార్చుకున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే 3ఇయర్స్ నుంచి  అనుకుంటున్నా ఈ కథను. మొదట ఒక లైన్ చెప్పగానే నిర్మాత వెంకట్ రెడ్డి గారికి బాగా నచ్చి సినిమా చేద్దామని చెప్పారు. ఈ సబ్జెక్టు యాప్ట్ అవ్వాలనే    నలుగురు అందమైన అమ్మాయిలను వెతికి వెతికి మరీ ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో  కూడా ఉన్నాము. సినిమాలో వీరి పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎవారూ పాత్రలు కాదు.. అందరూ హీరోయిన్సే.. హీరో సమీర్ ఖాన్ యాక్టింగ్ మెచూర్డ్ గా  ఉంటుంది.. కొత్త అన్నట్టుగా ఎక్కడా కనిపించదు.. కథ విషయానికి వస్తే.. ఈ తరం అమ్మాయిలు ఏవిధంగా ఫాస్ట్ కల్చర్ ను అలవర్చుకున్నారు అనే విధంగా తెరకెక్కించడం జరిగింది. కె ఎస్ అంటే హీరోల  పాత్ర పేరు కుమార్ స్వామి, ఇక 100 అంటే వాళ్ళ వందరోజుల స్నేహమే... కథ చాలా బాగా వచ్చింది. చాలా డిఫ్ఫరెంట్ స్టోరీ. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అని చెప్పొచ్చు. సస్పెన్స్ త్రిల్లర్ తో సినిమాను తెరకెక్కించాము కనుక చూస్తున్న ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా బయటికి పోకుండా సినిమా పూర్తయ్యే వరకు థియేటర్ లోనే ఉండిపోతారు. అంత నమ్మకంగా చెప్పగలను ఈ సినిమా గురుంచి.  నేను ఎప్పుడూ ప్లాప్ సినిమా చేయకూడదని తాపత్రయ పడుతాను. ఆ కసి లో నుంచి పుట్టిందే ఈ 'కె ఎస్ 100' చిత్రం. టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కనుక వీరితో మరో సినిమా ప్లాన్ చేసేసాము, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయి వెంకట్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు..  

Recent News