రా మూవీ రిక్రియేషన్స్ పతాకం పై కిషోర్,సన హీరో హీరోయిన్లు గా రఘు గోపసాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "దోషం" నాకా...!దేవుడికా..? అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కి రెడీ అవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత రఘు గోపసాని మాట్లాడుతూ "వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు .మనిషిని పట్టి పీడిస్తున్న దోషాల తలలను కోయడానికి త్రిశులంగా దూసుకొస్తున్న "దోషం" నాకా...!దేవుడికా..? అనే క్యాప్షన్ తో రాబోతుంది.ఈ చిత్రం లోని నటీనటులు నెల్లూరు లోని రామాపురం వాస్తవ్యులు.వీరందరు చాల చక్కగా నటించారు .వీరందరికి నా ప్రత్యేక కృతఙతలు తెలియజేస్తున్నాను .ఈ చిత్రంలో విలన్ గా నటించిన ప్రవీణ్ పున్నూరు అద్భుతంగా నటించాడు.ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తియ్యాయి.ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నాం" అన్నారు.