అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకే ఈ నెల 19న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే రేపే.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం జరిగే ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకోవడంతో అక్కినేని ఫాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి.