కథానాయకుడిగా మహా నటుడు అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ సంక్రాంతి సందర్బంగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టాక్ పరంగా హిట్ అందుకున్నప్పటికీ కలక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో లేకపోవడం విశేషం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకేకేకించిన సంగతి తెలిసిందే. ఇక రెండో భాగం మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయాలనీ అనుకున్నారు .. కానీ ఇప్పుడు ఆ డేట్ మారినట్టు ప్రచారం జరుగుతుంది. రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం గురించి ఉంటుందని ఆ ప్రయాణంలో అయన ఎదుర్కొన్న సవాళ్లు .. ఎలా జనాలకు మంచి చేశారన్న అంశాలతో సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి .. ఈ నేపథ్యంలో ఆ డేట్ వరకు అన్ని పనులు పూర్తీ చేయడం కుదరదనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఒకవారం వాయిదా వేసినట్టు టాక్. అంటే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 14న విడుదల చేస్తారట. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, రానా తదితరులు నటించారు.