టాలీవుడ్ లో సింగర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న కౌశల్య అంటే అందరికి తెలుసుగా .. సంగీత దర్శకుడు చక్రి నేతృత్వంలో ఆమె ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కౌశల్య తన వైవాహిక జీవితం పై అనేక సంచలన వ్యాఖ్యలు చేసారు. మా ఫ్యామిలీకి బాగా స్నేహం ఉన్న కుటుంబంలోని అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను .. మా అయన నాకు పెళ్లయిన 16 వ రోజు పండగ రోజే కొట్టాడు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి వాదించే వాడు .. ఆ క్రమంలో తీవ్రంగా కొట్టే వాడు అందుకే అతడిని వదిలేసి విడాకులు తీసుకున్నాను. అంటూ చాలా అనుభవాలు చెప్పింది. ఆమె వైవాహిక జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉండడం వల్లే .. విడిపోయానని చెప్పింది.