నందితాశ్వేత ప్రధాన పాత్రలో రూపొందుతున్నఅక్షర మూవీ మోషన్ పోస్టర్ భోగిసందర్బంగా విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం సమాజంలో విద్యకు మించిన వ్యాపారం లేదనే మాట ఎక్కువుగా వినపడుతుంది. కానీ సమాజాన్ని మార్చే ఆయుధం విద్యే అనే అందరూ ఒప్పుకుంటారు. అక్షర ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే ఆలోచనలకు ఈ మోషన్ అద్దం పడుతుంది.బలమైన కంటెంట్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు బి. చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ‘‘విద్య సమాజాన్ని మార్చే బలమైన ఆయుధం. కానీ విద్యావ్యవస్థ ఫక్తు వ్యాపారం లా మారిపోయింది. అలాంటి వ్యవస్థ పై అక్షర చేసే పోరాటం వినూత్నంగా ఉంటుంది. నందిత శ్వేత అక్షర పాత్రకు ప్రాణం పోస్తుంది. ఆమె కెరియర్ లో బెస్ట్ గా ఈ పాత్ర బెస్ట్ గా నిలుస్తుంది.సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ ని్లుస్తుంది.ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. శరవేగంగా మిగతా షూట్ ని కంప్లీట్ చేసుకొని సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ: ‘‘సినిమా కాన్సెప్ట్ ని టీజర్ గా రిలీజ్ చేసాం దానికి మంచి స్పందన వచ్చింది. మోషన్ పోస్టర్ ని కూడా కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసే విధంగా ప్లాన్ చేసాం. ఎడ్యుకేషన్ వ్యవస్థ లోని లోపాలను బోల్డ్ గా తెరమీదకు తీసుకురాబోతున్నాం. భోగి సందర్బంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది.’’ అన్నారు. మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ: మోషన్ పోస్టర్ కి వస్తున్నస్పందన చాలా ఆనందాన్ని కలిగించింది . ప్రేక్షకుల ఆలోచనలలో మార్పు తెచ్చే విధంగా అక్షర రూపు దిద్దు కుంటుంది. విద్యా కి వ్యాపారం పర్యయపదం అయ్యింది . అలాంటి ఆలోచనలు మార్చేందుకు అక్షర చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది’ అన్నారు.