బిగ్ డీల్ పట్టేసిన కేథరిన్

17 Jan,2019

కేథరిన్ థ్రెస్సా గత కొంతకాలంగా టాలీవుడ్ సర్కిల్స్ లో కనిపించకపోయినా కెరీర్ పరంగా ఖాళీగా ఏం లేదు. ఓవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంటూనే కథానాయికగానూ అడపా దడపా అవకాశాలు అందుకుంటోంది. కేథరిన్ ప్రస్తుతం తమిళం - మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. తదుపరి `వంత రాజవథాన్ వరువేన్` (అత్తారింటికి దారేది రీమేక్) రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో సింబు కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పామోలివ్ బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది.  అందుకు సంబంధించిన టీవీ కమర్షియల్ ఇప్పటికే చిత్రీకరించారు. ఇందులో కేథరిన్ అందచందాల ఎలివేషన్ వీక్షకుల మతి చెడగొడుతోంది.  `సరైనోడు` చిత్రంలో ఎమ్మెల్యగా అలరించిన కేథరిన్ అటుపైనా బోయపాటి తెరకెక్కించిన జయ జానకి నాయికలో `ఏ ఫర్ యాపిల్...` అంటూ వేడెక్కించే ఐటెమ్ నంబర్ లో నర్తించింది. 

Recent News