షూటింగ్ పూర్తీ చేసుకున్న 7 సెవెన్ చిత్ర టీం. టాకీ పనుల్లో బిజీ బిజీ. ప్రపంచ వ్యాప్తంగా త్వరలో భారీ విడుదల.
విడుదల అయిన ఒక్క టిజర్ తోనే ప్రేక్షకుల నుండి మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి ట్రెండ్ క్రియేట్ చేసిన చిత్రం సెవెన్ (7). రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా ఆమ్బ్రోష్, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి, రహ్మాన్, హవిష్ లు ముఖ్య తారాగణం గా, ధనరాజ్, సత్య, వంటి ప్రముఖ తారాగణం కమెడియన్స్ గా నటిస్తున్న ఈ సెవెన్ చిత్రం మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని చిత్ర బృందం గుమ్మడికాయ కూడా కొట్టేసింది అని సమాచారం. తెలుగు తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అతి త్వరలో టాకీ, డబ్బింగ్, రికార్డింగ్, మిక్సింగ్ పనులు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అయ్యేందుకు సిద్దమవుతుందట. ఈ సెవెన్ చిత్రం పై ఉన్న క్రేజ్ చూసి ఇప్పటికే ఏరియా వైజ్ వ్యాపారం కూడా నిర్మాతలు మొదలు పెట్టారని వినికిడి. విడుదల అయిన టిజర్ నీ మనం చూసుకుంటే ఈ సినిమా స్థాయి మనకు కనపడుతుంది, టిజర్ లో మనం విన్న అన్ని డైలాగ్స్, చూసిన ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉండి సినిమా పై హైప్ ఇంకా పెంచుతున్నాయి. మంచి కంటెంట్ తో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంకు రమేష్ వర్మ నిర్మాతగా వ్యవహరించగా, కెమెరా మరియు దర్శకత్వ బాద్యతలు నిజార్ షఫీ తీసుకున్నారు. సంగీతం : చైతన్ భరద్వాజ్, సాహిత్యం : శ్రీమణి, పులగం. ఎడిటర్ ప్రవీణ్ కె.ఏల్. కథ – స్క్రీన్ ప్లే – నిర్మాత : రమేష్ వర్మ,