మొత్తానికి సంక్రాంతి బరిలో దిగిన ఎఫ్ 2 సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. విక్టరీ వెంకీ చెలరేగిపోయి నటించడం .. ఫన్ అండ్ ఫ్రేష్ట్రేషన్ అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 12. 0 కోట్ల వసూళ్లను అందుకుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం ..
షేర్ లలో ..
నైజాం - 1. 75 కోట్లు,
సీడెడ్ - 0. 44 కోట్లు,
ఉత్తరాంధ్రా - 0. 55 కోట్లు,
గుంటూరు - 0. 39 కోట్లు,
కృష్ణా - 0. 40 కోట్లు,
ఈస్ట్ - 0. 63 కోట్లు,
వెస్ట్ - 0. 57 కోట్లు,
నెల్లూరు -0. 17 కోట్లు,
ఆంధ్రా - తెలంగాణ లో కలిసి 4. 90 కోట్లు,
ప్రపంచ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో - 7. 06 కోట్లు,
యూ ఎస్ - 2. 2 కోట్లు,
రెస్ట్ అఫ్ ఇండియా - 0. 05 కోట్లు,