ట్రైన్ సీన్ తీసేసారా .. రామ

15 Jan,2019

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన వినయ విధేయ రామ చిత్రం భిన్నమైన టాక్స్ వినిపిస్తున్నాయి. హిట్ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో బోయపాటి చేయించిన యాక్షన్ ఓ రేంజ్ లో ఓవర్ అయిందని .. హీరోని మరి బాహుబలి లా చూపించాలని ట్రై చేసాడని, ముక్యంగా ట్రైన్ సన్నివేశం టూ మచ్ గా ఉందని దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ విషయం యూనిట్ దాకా చేరడంతో అందులోని ట్రైన్ సీన్ ని తీసేస్తున్నారట. హీరో రామ్ చరణ్  అన్నయ్య ప్రశాంత్ ని విలన్ ఎక్కడో బీహార్ బోర్డర్ కు తీసుకెళ్లి అక్కడ గద్దలకు ఆహారంగా వేయాలని చూస్తాడు .. అప్పుడు ప్రశాంత్ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి నీకు సమాధానం చెప్పేవాడు ఒక్కడున్నాడు అని రామ్ చరణ్ కు ఫోన్ చేయగానే .. ఎయిర్ పోర్ట్ లో ఉన్న చరణ్ పరుగెత్తుకుంటూ వచ్చి స్పీడ్ గా వెళుతున్న ట్రైన్ పై దూకి బిహారి కు వస్తాడు .. నిజంగా ఆ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్స్ లో జనాల అల్లరి ఓ రేంజ్ లో ఉంది. ఈ సన్నివేశం పై మెగా ఫాన్స్ దర్శకుడిపై తీవ్రంగా విమర్శలు చేయడంతో ఇప్పుడు ఆ సన్నివేశాన్ని తీసేస్తున్నారట.

Recent News