యమ్‌ 6 సెన్సార్‌ పూర్తి

14 Jan,2019

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన చిత్రం 'యమ్‌6'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ ''మా 'యమ్‌6' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా చాలా క్వాలిటీగా నిర్మించాం. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే ఒక అద్భుతమైన కథని దర్శకుడు జైరాం అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు. 
దర్శకుడు జైరామ్‌వర్మ మాట్లాడుతూ ''నిర్మాత విశ్వనాథ్‌గారు ఈ సినిమాను క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సినిమాను నేచురల్‌గా తెరకెక్కించాం. ప్రత్యేకంగా పోరాట ద శ్యాలు మన కళ్ళముందే జరుగుతున్నట్లు ఉంటూ అందరినీ అలరిస్తాయి. ఇలాంటి సినిమాలు తమిళ, మలయాళ, కన్నడలో వచ్చేవి. ఇప్పుడు తెలుగు ప్రజలు కూడా ఈ రకమైన సినిమాల్ని ఎంజాయ్‌ చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమాని ఒక రకమైన ప్రయోగంలా భావించి తెరకెక్కించాము. చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్‌గా ఫీల్‌ అవుతూనే లవ్‌, కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు. 
హీరో ధ్రువ మాట్లాడుతూ ''ఒక మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా టాలెంట్‌ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు క త్ఞతలు'' అన్నారు 
ధ్రువ, అశ్విని, శ్రావణి, తిలక్‌, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బాలాజీ, సినిమాటోగ్రఫీ: మహ్మద్‌ రియాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌, సమర్పణ: శ్రీమతి పార్వతి, నిర్మాత: విశ్వనాథ్‌ తన్నీరు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జైరామ్‌ వర్మ. 

Recent News