క్యాథరిన్ ధెరిస్సా లక్కీ ఛాన్స్ కొట్టేసింది… తమిళంలో బిజీగా ఉన్న ఈ నటి టాలీవుడ్ మాత్రం అవకాశాలు మాత్రం రావడం లేదు..సరైనోడు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్ రేస్ లో బాగా వెనుకబడిపోయింది.. ఈ దశలో ఆమెకు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించకుందనే వార్తలు వినవస్తున్నాయి.. విజయ్ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్నాడు.. ఈ మూవీ తర్వాత ఓనమాలు, మళ్లీ మళ్లీ రాని రోజు మూవీల ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు.. కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ మూవీలో క్యాథరిన్ ను తీసుకున్నారు.