నానువ్వే తరువాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘118’ టీజర్ ఇటీవల విడుదలై సినిమాఫై అంచనాలను తీసుకురాగలిగింది . ఇక తాజాగా ఈచిత్రం యొక్క విడుదలతేది ఖరారైయింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 1న విడుదలకానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే , నివేత థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ డైరెక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు.