నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న మూవీ జెర్సీ… మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్నమూరి ఈ మూవీకి దర్శకుడు.. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలతో చిత్ర టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.. ఇందులో నాని క్రికెటర్గా అదరగొట్టాడు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న జెర్సీ చిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. లేటు వయసులో క్రికెటర్ గా రాణించినట్లుగా ఈ టీజర్ లో చూపారు.. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.