మణిరత్నం సినిమా మిస్ చేసుకున్న వెంకీ

11 Jan,2019

నిజంగా జీవితంలో ఏది జరగాలని ఉంటె అదే జరుగుతుంది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టుగా అనిపిపించే సంఘటనలు మన జీవితంలో చాలా చూసీ ఉంటాం .. ఇప్పుడు అలాంటి అనుభవమే మన స్టార్ హీరో వెంకటేష్ లైఫ్ లో జరిగింది. ప్రస్తుతం అయన నటిస్తున్న ఎఫ్ 2 చిత్రం శనివారం విడుదల కానున్న నేపథ్యంలో వెంకీ మీడియా తో ముచ్చటించారు .. ఈ సందర్బంగా చాలా విషయాలను పంచుకున్న అయన .. తన లైఫ్ లో మణిరత్నం సినిమా మిస్ అయ్యానని చెప్పడం విశేషం .. ఆ వివరాల్లోకి వెళితే .. ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న మణిరత్నం అప్పట్లో రోజా సినిమా తీసే ప్రయత్నాల్లో భాగంగా హీరో పాత్ర కోసం వెంకీని కలిశాడట .. అయితే అప్పుడు వెంకటేష్ కి భుజానికి గాయం అవ్వడం వల్ల .. ఆ సినిమా చేయడానికి కుదరలేదని .. దాంతో అరవింద్ స్వామి హీరోగా ఎంట్రీ ఇచ్చి అటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు .. ఆ సినిమా చేసి ఉంటె తానూ కూడా హిందీలో సెటిల్ అయ్యేవాడినేమో అంటూ కాస్త వైరాగ్యాంగా చెప్పాడు వెంకీ .. నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ .. లేకుంటే మన వెంకీ బాలీవుడ్ లో దుమ్ము రేపేవాడే !!  నేను ఫలానా సినిమా చేయాలనీ అనుకోను .. ఓ సందర్బంగా ఫ్యామిలీ సినిమా చేశాను .. ఆ సినిమా హిట్ తో అన్ని అలాంటి కథలే వచ్చాయని చెప్పాడు. ప్రస్తుతం తాను చైతు తో కలిసి వెంకీ మామ చేస్తున్నానని .. దాంతో పాటు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి ల తో సినిమాలు ఉంటాయని చెప్పాడు. 

Recent News