సామాజిక మాధ్యమాల వేదికగా ఈ యంగ్ బ్యూటీ .. ఫోటోషూట్లు వీడియో షూట్లతో చెలరేగిపోతుంటుంది. 2018 లో అదా ట్రీట్ అదరహో అన్న తీరుగా సాగింది. వీనులవిందైన పసందైన ఫోటోలు- వీడియోల జాతరతో సంవత్సరం అంతా అగ్గి రాజేస్తూనే ఉంది. వీలున్న ప్రతి సందర్భాన్ని ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించింది. ట్విట్టర్ ఇన్స్టాల్లో అదా గొప్పగా ఫాలోవర్స్ ని పెంచుకుంది. తాజాగా మరో అదిరిపోయే ట్రీట్ ని తన ఫాలోవర్స్ కోసం రెడీ చేసింది. ఇంకా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టక ముందే అభిమానులకు మతిచెడే ట్రీట్ ఇచ్చింది అదా. ఈసారి కూడా వేడెక్కించే బికినీ ట్రీట్. అదా అందాల్ని పీక్స్ లో ఆవిష్కరించింది.
ఇలా రెగ్యులర్ గా ఫోటోషూట్లతో చెలరేగడం సరే! కనీసం 2019లో అయినా ఈ కుర్ర బ్యూటీ బిగ్ గోల్స్ ను సెట్ చేసుకుని కెరీర్ పరంగా ఎదిగేందుకు ఏం చేస్తుందో మాత్రం తేలాల్సి ఉంది. ఇప్పటివరకూ తనకు ఎంతో ఆశావహ అవకాశాల్ని ఇచ్చిన టాలీవుడ్ లో కొత్త సినిమాకి సంతకం చేసింది లేదు. అటు తమిళం హిందీలో అవకాశాలు ఉన్నాయని చెబుతున్నా ఇంత వరకూ ఏదీ రిలీజ్ కి రాలేదు. తమిళంలో చార్లీ చాప్లిన్ 2 చిత్రంలో నటిస్తోంది. హిందీలో బైపాస్ రోడ్ అనే సినిమాతో పాటు కమెండో 3 అనే వెబ్ సిరీస్ చేస్తోంది.