డ్యూయెల్ రోల్ లో శర్వానంద్ 

09 Jan,2019

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘పడి పడి లేచె మనసు’ తో ప్రేక్షకులముందుకు వచ్చిన శర్వాకి ఆ చిత్రం అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. నిజానికి ఈసినిమాపై శర్వా భారీ ఆశలే పెట్టుకున్నాడు కానీ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ఫై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాడట ఈ హీరో. ‘స్వామి రారా’ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు శర్వా. 1980 బ్యాక్ డ్రాప్ లో సాగె గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. అందులో ఒకటి యువకుడి పాత్రకాగా మరొకటి వృద్ధుడి పాత్ర అని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం   షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

Recent News