మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సుతో ప్రారంభమైన సాయిధరమ్తేజ్వి.వి.వినాయక్ సి.కళ్యాణ్ భారీ చిత్రం
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, లావణ్య త్రిపాఠి కథానాయికగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.4గా సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం బుధవారం ఉదయం 9.27 గంటకు ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అంటూ అందించిన ఆశీస్సుతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హీరో సాయిధరమ్‌తేజ్‌పై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ నివ్వగా, మరో ప్రముఖ రచయిత సత్యానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రానికి కథ, మాటు అందించిన ఆకు శివ ఫస్ట్ షాట్‌ని డైరెక్ట్ చేశారు. హీరో సాయిధరమ్ తేజ్ తల్లిగారైన శ్రీమతి విజయదుర్గ స్క్రిప్ట్‌ని అందించారు.
ఇప్పటివరకు చేసిన సినిమాతో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్‌తేజ్, పవర్ఫుల్ సినిమాకు చిరునామా అనిపించుకుంటున్న వి.వి.వినాయక్ మొదటి కాంబినేషన్లో రూపొందుతున్న మరో పవర్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రం రెగ్యుర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది.
సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించే ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రు పోషిస్తారు. ఈ చిత్రానికి కథ, మాటు: ఆకు శివ, సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, మేకప్: బాషా, కాస్ట్యూమ్స్: వాసు, స్టిల్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: జి.జి.కె.రాజు, సతీష్ కొప్పినీడి, కోడైరెక్టర్స్: సూర్యదేవర్ ప్రభాకర్ నాగ్, పుల్లారావు కొప్పినీడి, సహనిర్మాతు: సి.వి.రావు, పత్స నాగరాజా, నిర్మాత: సి.కళ్యాణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటు, ఇతర సాంకేతిక నిపుణు ఎంపిక జరుగుతోంది.