విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
మెహరీన్ మాట్లాడుతూ - ``దర్శకుడు అనీల్రావిపూడిగారు నాలో నుండి బెస్ట్ నటనను రాబట్టుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశాను. నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో నేను చేస్తోన్న రెండో సినిమా.. వారికి నా ధన్యవాదాలు. వెంకీగారు, వరుణ్, తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. కల నిజమైనట్లుగా ఉంది. తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. ఇందులో ఫన్ మాత్రమే ఉంటుంది. ఫ్రస్టేషన్ ఉండదు`` అన్నారు.
తమన్నా మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారి బ్యానర్లో ఎప్పటి నుండో పనిచేయాలని వెయిట్ చేస్తున్నాను. మధ్య కొన్ని అవకాశాలు వచ్చినా కుదరలేదు. ఈ సినిమాకు కుదిరింది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు దిల్‌రాజుగారికి థాంక్స్. కామెడీ సినిమాల్లో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆధారంగా కామెడీ ఉంటుంది. అనిల్ రావిపూడిగారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బ్లోన్ అయ్యాను. అందరం కలిసి ఓ టీంలా కలిసి పనిచేశాను. సినిమాలో దాదాపు 22 మంది నటీనటులు పనిచేశాం. ఈ సినిమాలో ఎక్కువ క్రెడిట్ అనిల్గారికే చెందుతుంది. వెంకీగారు చాలా సంవత్సరాలుగా నన్ను ఇన్స్పైర్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఆయనింకా ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనపడుతున్నారనేది నాకింకా తెలియలేదు. వరుణ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. హనీ క్యారెక్టర్లో మెహరీన్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేను. తను పాత్రలో అంత బాగా ఒదిగిపోయింది. తను అమేజింగ్ యాక్ట్రెస్. త్వరగా ఎఫ్ 3 చేయాలని కోరుకుంటున్నాను`` అన్నాను.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``రాజాదిగ్రేట్ తర్వాత ఏ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు అనీల్ ఈ ఐడియా చెప్పాడు. అప్పటి నుండి 15 నెలల పాటు ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ వచ్చాం.అనీల్‌తో ఇది మూడో సినిమా. కానీ మూడు సినిమాల ప్రయాణంలో ఎక్కడా చిన్న క్లాష్ రాలేదు. వెంకటేష్‌గారు, వరుణ్, తమన్నా, మెహరీన్ సహా ప్రతి ఒక క్యారెక్టర్లో ఎంటర్టైన్మెంట్ కనపడుతుంది. థియేటర్లో 2గంటల 26 నిమిషాల్లో గంటన్నర పాటు నవ్వుకూనే ఉంటారు. సంక్రాంతికి ఎఫ్ 2 అందరికీ ఫన్ ఇస్తూ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం`` అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ``డిఫరెంట్ జోనర్లో సినిమాలు చేస్తూ వచ్చాను. ఆ క్రమంలో కామెడీ సినిమాలు కూడా చేయాలనుకున్నాను. నా కెరీర్లో ఎంత కామెడీ చేయాలనుకున్నానో దాన్ని అంతా అనిల్ ఒక సినిమాలో చేయించేశాడు. ఇలాంటి పాత్ర చేయడం, ఇలాంటి మంచి సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు, అనీల్ సహా అందరికీ థాంక్స్. వెంకీగారు కామెడీ అంటే ఇరగదీస్తారు. ఆయనతో చేయడమంటే కాస్త టెన్షన్ పడ్డాను. అయితే ఆయన కంఫర్ట్ ఇచ్చి సినిమాను చేయించారు. ఆయనతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ - ``ముందుగా అనీల్‌కి థాంక్స్. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తర్వాత ఫుల్ ప్లెజ్డ్ల్ కామెడీ మూవీ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత అలాంటి మూవీ చేశాను. దిల్‌రాజుగారు, అనీల్ గారు నేను కామెడీతో మెప్పిస్తానని నమ్మకంతో నా వద్దకు రావడంతో ఎఫ్ 2 సినిమా చేశాను. వరుణ్ చక్కగా చేశాడు. తమన్నా, మెహరీన్ సహా అందరితో నటించడం హ్యాపీగా ఉంది. క్యారెక్టర్స్ అన్నీ చక్కగా డిజైన్ చేశారు. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫన్ మూవీ`` అన్నారు.