ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి పనిచేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. పూరి-రామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు 'ఇస్మార్ట్ శంకర్' అనే టైటిల్ ను ఫైనలైజ్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ కన్ఫాం అయింది. మోషన్ పోస్టర్ లో మొదట డబల్ సిమ్ కార్డ్ అని ఇంగ్లీష్ లెటర్స్ వస్తాయి. ఫస్ట్ లుక్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. టైటిల్ కూడా సూపర్ క్యాచీగా ఉంది. మరి ఈ సినిమాతోనైనా ప్రేక్షకులను మెప్పించి..రామ్ కు కూడా ఒకమంచి హిట్టిస్తాడేమో వేచి చూడాలి.