అ’ సినిమా వరకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది రెజీనా కసాండ్రకు. అయితే ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఆమె పెద్దగా కనిపించట్లేదు. కనిపించట్లేదు అనేకంటే ఆమెకు సరైన అవకాశాలు రావట్లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో రెజీనా ఓ బాలీవుడ్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో ‘ఏక్ లడకీ కొ దేఖా తో ఐసా లగా’ అనే హిందీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో సోనమ్ కపూర్ ప్రేయసిగా రెజీనా కనిపించనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో సోనమ్, రెజీనా ఇద్దరూ లెస్బియన్స్ అని, వారి మధ్య ప్రేమ కథే ఈ సినిమాలో ప్రధాన అంశం అని తెలుస్తోంది. షెల్లీ చోప్రా ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ చుసిన ఈ విషయం అర్థమవుతోంది. అయితే ట్రైలర్ లో రెజీనా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించట్లేదు.