ఓ.యస్.యం విజన్ - దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరో. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలె విడుదలై వన్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఫిబ్రవరి 1 విడుదలవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -``ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ కి అనూహ్య స్పందన వచ్చింది. 1 మిలియన్ వ్యూస్ ను మా ట్రైలర్ రీచ్ అయింది.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1 సినిమాను విడుదల చేస్తున్నాం. ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిదని అన్నారు.