మలయాళంలో 80-90 దశకంలో ‘షకీలా’ సినిమా విడుదల అవుతుందంటే చాలు.. యువత ఆమె చిత్రాల కోసం తెగ పోటీపడి మరీ చూసేవారు. అలాంటి ‘షకీలా’ జీవిత కథ త్వరలో సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ముగింపు దశలో ఉంది. ఈ ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదల అవుతుందని చిత్రబృందం స్పష్టం చేసింది.
కాగా, ‘షకీలా’ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షకీలా అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. తన బయోపిక్ గురించి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.. తన జీవితంలోని అతి ముఖ్యమైన తప్పులు, ఒప్పులు ఇలా ప్రతి అంశం ఈ బయోపిక్ లో ఉంటాయని తెలిపింది.