అల్లుడు శీను' చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో టాలీవుడ్లోకి హీరోగా అడుగుపెట్టి సూపర్‌హిట్ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆ తరువాత 'స్పీడున్నోడు', 'జయజానకినాయక', 'సాక్ష్యం' , 'కవచం'వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆట్టుకన్నారు. హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టినరోజు నేడు(జనవరి 3). ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామ, బెక్కెం వేణుగోపాల్, అనీల్ సుంకర, మల్టీ డైమన్షన్ వాసు, మహేంద్ర, బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ''సాయికి హ్యాపీ బర్త్‌డే. తనతో 'అల్లుడు శీను' చేస్తున్న సమయంలో కొత్త హీరోతో చేసిన ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ఎక్స్పీరియెన్స్డ్ హీరోలా అనిపించాడు. అలాగే బోయపాటితో చేసిన సినిమాలో స్టార్ అయ్యాడు. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాకు ఎదుగుతున్నాడు. 'అల్లుడు శీను' సినిమాను, పాటలను నేను మరచిపోలేను. ఎందుకంటే ఆ సినిమాను అంత గ్రాండియర్‌గా చేశాం. తను ఇంకా పెద్ద స్టార్‌గా ఎదగాలి. ఎవరికైనా ఒకట్రెండు ఫెయిల్యూర్స్ కామన్. హీరో తను ఎప్పుడూ ఫెయిల్ కాడు.. అవ్వడు కూడా. తనకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''సాయి మా ఫ్యామిలీ మెంబర్. సినిమా, సినిమాకు తను డాన్స్, ఫైట్స్ పరంగానే కాదు.. నటన పరంగా ఎదుగుతూ వస్తున్నాడు. మంచి మంచి స్టోరీస్‌ను ఎంచుకుని సినిమాలు చేసి తను మరింతగా ఎదగాలి. ఆల్ ది బెస్ట్ టు సాయి'' అన్నారు.