వైదేహి భయపెడుతుందా  

02 Jan,2019

యాక్టివ్ స్టూడియోస్ ప‌తాకంపై ఎ.జి.ఆర్‌. కౌశిక్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `వైదేహి`. ఎ.జ‌న‌నీ ప్ర‌దీప్ నిర్మాత‌. ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌కుడు. ఈయ‌న దివంగ‌త న‌టుడు ఏవీయ‌స్ త‌న‌యుడు. ఏవీయ‌స్ జ‌యంతిని పుర‌స్క‌రించుని  హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఎన్‌.శంక‌ర్ విడుద‌ల చేశారు. ఏవీయ‌స్ జ‌యంతి సంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు కేక్ క‌ట్ చేశారు. ద‌ర్శ‌కుడు ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ మాట్లాడుతూ ``మా నాన్న‌గారిని గుర్తుచేసుకోవ‌డానికి ఓ మంచి అకేష‌న్ ఉంటే బావుంటుంద‌నిపించింది. ఆయ‌న పుట్టిన రోజున మా సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకోవ‌డం ఆనందంగా ఉంది. న‌న్ను ప్రోత్స‌హించిన వారు చాలా మంది ఉన్నారు. మా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లను చాలా ఇబ్బందిపెట్టాను. రాత్రింబ‌వ‌ళ్లు షూటింగ్‌లు చేసేవాళ్లం. అయినా వారంద‌రూ చిరున‌వ్వుతో ప‌నిచేసేవారు. మా కుటుంబ స‌భ్యుల‌క‌న్నా ఎన్‌.శంక‌ర్‌గారు నాకు చాలా ఆత్మీయులు. ఆయ‌న చేతుల మీదుగా మా ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది.  మా బావ‌గారు నాకు ఇచ్చే స‌పోర్ట్ ను మ‌ర్చిపోలేను. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న మా నాన్న‌గారిలాగా న‌న్ను ప్రోత్స‌హిస్తున్నారు`` అని అన్నారు. ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ `ఏవీయ‌స్ నాకు మంచి మిత్రులు. అద్భుత‌మైన క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉన్న వ్య‌క్తి. సినిమాల‌ను, సాహిత్యాన్ని ఔపాస‌న ప‌ట్టిన వ్య‌క్తి. ఆయ‌న లేని లోటు ఇండ‌స్ట్రీలో ఉంది. తుత్తి, రంగు ప‌డుద్ది వంటి మేన‌రిజ‌మ్స్ ను ఆయ‌న చాలా బాగా వాడేవారు. ఆయ‌న త‌న‌యుడు రాఘ‌వేంద్ర ప్ర‌దీప్ తెర‌కెక్కించిన ఈ సినిమా ట్రైల‌ర్ బావుంది. ఇప్పుడు ఇలాంటి జోన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమాలు 90 శాతం హిట్ అవుతున్నాయి. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ నెక్స్ట్ ఏంటి? అని ఆస‌క్తిక‌లిగేలా సినిమాను తెర‌కెక్కించడం బావుంది. ట్రైల‌ర్‌లో ఆ ఉత్సుక‌త క‌నిపిస్తోంది`` అని చెప్పారు. 

Recent News