త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్

31 Dec,2018

 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత   కొరటాల శివకు అవకాశం ఇచ్చాడు చిరంజీవి. కొరటాల శివ ఇప్పటివరకు ఫ్లాప్ అనేదే లేకుండా దూసుకుపోతున్నాడు. అదీగాక.. శివ సినిమాల్లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అంతర్లీనంగా మేసేజ్ కూడా ఉంటుంది. ఇలాంటి సినిమాలు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోకి పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాయి. భరత్ అను నేను సినిమా తర్వాత శివ కూడా వేరే ప్రాజెక్టులేవీ కమిట్ కాకుండా.. చిరు కోసం కథ - కథనాల్ని సిద్ధం చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు మెగాస్టార్ మనసు మారింది. కొరటాల శివతో కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇటీవలే ఆడియో వేదికగా ఎనౌన్స్ కూడా చేశాడు. సైరా తర్వాత తన నెక్ట్ సినిమాను త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్రివిక్రమ్ ఓకే అయితే.. మరి కొరటాల శివ పరిస్థితి, ఇప్పటికే మెగాస్టార్ ని దృష్టిలో పెట్టుకుని కథ - కథనాల్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు.   వేరే ఎవరైనా చిన్న హీరోతో సినిమాను ప్లాన్ చేసుకోవాలా.. లేదంటే.. మెగా ఫ్యామిలీయే తమలో ఉన్న ఏ హీరోతో అయినా సినిమా చేసే అవకాశం ఇస్తుందా..చూడాలి. 

Recent News