'భాగమతి' తర్వాత అనుష్క ఏ సినిమాలో నటిస్తోందనే విషయం ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయిగానీ ఒక ప్రాజెక్ట్ మాత్రం కన్ఫామ్. అదే రచయిత కోన వెంకట్ - దర్శకుడు హేమంత్ మధుకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందట. ఈమధ్యే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వెల్లడించాడు కోన వెంకట్.
ఈ సినిమా అమెరికా నేపథ్యంలో తెరకెక్కే ఒక హారర్ ఫిలిం అని టాక్ . అలాగే హాలీవుడ్ నటులు కూడా నటిస్తారని తెలిసింది. భారీ స్థాయిలోనే నిర్మిస్తామని.. 'బాహుబలి' సాధించిన విజయమే తమకు ఇన్స్పిరేషన్ అని కోన తెలిపాడు. ఈ సినిమాలో హీరో మాధవన్.. సుబ్బరాజు కీలక పాత్రలలో నటిస్తారు. ఇదిలా ఉంటే 'సైజ్ జీరో' సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క అప్పటినుండి బరువు తగ్గించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలో చేస్తోంది , రెండ్రోజుల క్రితం కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అనుష్క కొత్త ఫోటోను పోస్ట్ చేసి "మా సినిమాలో అనుష్క లుక్ ను చూసి నేను ఎగ్జైట్ అవుతున్నాను.. ఇది అనుష్క కు ఇప్పత్వరకూ బెస్ట్ లుక్ అని అనుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. అనుష్క ఇప్పటివరకూ నటించిన హారర్ ఫిలిమ్స్ అన్నీ సూపర్ హిట్లే. 'అరుంధతి'.. 'భాగమతి' లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి.