ఫిబ్రవరి నుండి నాని- విక్రమ్ ల సినిమా 

25 Dec,2018

టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని తన 24వ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి 19 నుండి మొదలుకానుందని తెలిసిన సంగతే. అయితే ఈ చిత్రం పూర్తి థ్రిల్లర్ గా ఉండబోతుందని, అలాగే ఆడవారికి సంబందించిన మంచి సోషల్ మెసేజ్ కూడ ఈ సినిమాలో ఉండే అవకాశముందట. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామేన్ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. తర్వలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది. 

Recent News