మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం ‘వినయ విధేయ రామ’ షూటింగ్ ఈనెల 26తో పూర్తి కానుంది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ లో చరణ్ సరసన కియరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 27న యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరుగనుందని అదే ఈవెంట్ లో ఈచిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 11న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని సమాచారం. చరణ్ నటించిన ‘రంగస్థలం’ ఈ ఏడాది లో విడుదలై టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రం గా రికార్డు సృష్టించింది. దాంతో ఆయన నటిస్తున్నఈ వివిఆర్ ఫై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.