ప్రేమ కథా చిత్రమ్ 2" అంటూ ప్రేమకథచిత్రమ్ కి సీక్వెల్ గా వస్తున్న చిత్రం యెక్క టీజర్ ని విడుదల చేశారు. ట్రెండి గా వుంటూ బ్యాక్ టు ఫియర్ అనిపించేలా టీజర్ అందరి చేత ప్రశంశలు పొందుతుంది. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న చిత్రాలు తరువాత హ్యట్రిక్ చిత్రంగా ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్,సిద్ధి ఇద్నాని లు జంటగా నటిస్తున్నారు. హర్రర్ కామెడి కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన ప్రేమకథాచిత్రమ్ సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో కామెడి కి మళ్ళి పెద్దపీట వేశారనేది స్పష్టమవుతుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.." ప్రేమకథా చిత్‌నమ్ ఎంతటి ఘనవిజయం సాదించిందో అందరికి తెలుసు.. ఈ రోజు విడుదల చేసిన ప్రేమకథాచిత్రమ్ 2 టీజర్ చూసినివారంతా కూడా అదే రేంజి చిత్రం అవ్వబోతుందని చెప్పటం చాలా ఆనందంగా వుంది. టీజర్ లో హీరో సుమంత్ అశ్విన్, సిద్ది ఇద్నాని లు చాలా ప్లెజంట్ గా నటిస్తే.. నందిత శ్వేత తన విశ్వరూపం చూపించింది. నిజంగా ప్రేక్షకులు చూసింది టీజర్ మాత్రమే.. ఇంకా చాలా వుంది. ఈ సినిమా మెదటి భాగాన్ని మించి వుండబోతుంది. జనవరి లో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము "అని అన్నారు.