లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్`. చేతన్ భగత్ రాసిన నవల `2 స్టేట్స్` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడవిశేష్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ను జనవరిలో అమెరికాలో జరుపుకోనుంది. ఈ సందర్భంగా.. నిర్మాత ఎం . ఎల్ . వి . సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ - ``అడివిశేష్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ `2 స్టేట్స్`. ఇప్పటికే కోల్‌కతాలో రెండు షెడ్యూల్స్, హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. ఇప్పటి వరకు జరిగిన రషెష్ చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటి వరకు సినిమా 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ అమెరికాలో జరగనుంది. వీసాలు రావడం లేట్ అవడం వల్లనే సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. ఇప్పుడు వీసాలు వచ్చేశాయి. జనవరి 2019 లో యూనిట్ అమెరికా బయలుదేరుతుంది. అక్కడ మిగిలిన 40 శాతం చిత్రీకరణను పూర్తి చేస్తాం. అమెరికా షూటింగ్‌తో 90 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. బ్యాలెన్స్ 10 శాతం ప్యాచ్ వర్క్‌ను హైదరాబాద్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం. దాంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది `` అన్నారు.