విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు

22 Dec,2018

టాలీవుడ్ సంచలన స్టార్ విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా బాలీవుడ్ లో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ తో ఈయన ఒక చిత్రం చేయబోతున్నాడని అందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కరణ్ జోహార్ మూవీ విషయం ఏమో కాని తాజాగా ఒక హిందీ సినిమాకు విజయ్ దేవరకొండ సైన్ చేశాడు. హిందీలో విజయ్ దేవరకొండ ఎంట్రీ హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండబోతుంది. ఇండియాకు ప్రథమ ప్రపంచ కప్ ను తీసుకు వచ్చిన కపిల్ దేవ్ బయోపిక్ గా ‘83’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఖబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచ కప్ సాధించిన తర్వాత ఇండియాలో క్రికెట్ కు అనూహ్యంగా ఆధరణ పెరిగింది. ఇండియాలో క్రికెట్ కు ఇంతగా ఆధరణ కలిగేలా చేసిన కపిల్ దేవ్ మూవీ పై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 1983 ప్రపంచ కప్ సిరీస్ లో టీం ఇండియా తరపున కపిల్ దేవ్ తో పాటు కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను విజయ్ దేవరకొండ పోషించబోతున్నాడు. కపిల్ మరియు కృష్ణమాచారి శ్రీకాంత్ లు మంచి స్నేహితులు. సినిమాలో కృష్ణమాచారి పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ‘86’ చిత్రంలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో సినిమాపై సౌత్ లో కూడా భారీగా ఈ చిత్రంకు రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ తెలుగులో ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.
 

Recent News