సర్కార్, నవాబ్ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "పెట్టా" చిత్రాన్ని "పేట" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.కాగా ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ "సూపర్ స్టార్ రజినీకాంత్ రొరింగ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా తెరకెక్కిన "పేట" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తునందుకు సంతోషంగా ఉంది.చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్భారాజ్ రజినీకాంత్ కు వీరాభిమాని.అందుకే రజినీకాంత్ ను అయన తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి ఎక్స్ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు.అలాగే ఈ చిత్రం లో ప్రతి ఒక్కరిపాత్రలు ఆకట్టుకుంటాయి.అటు మాస్ ఆడియెన్స్ ను ,ఇటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్నమంచి చిత్రమిది.ఈ చిత్రాన్ని సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నాం" అన్నారు. త్రిష,సిమ్రాన్,విజయ్ సేతుపతి,బాబీ సింహ,నవాజుద్దీన్ సిద్ధికి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్,నిర్మాత: వల్లభనేని అశోక్.