- Home
- News
- జనవరి నుండి మహేష్ - సుక్కు ప్రాజెక్ట్
జనవరి నుండి మహేష్ - సుక్కు ప్రాజెక్ట్
18 Dec,2018
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'రంగస్థలం' రిలీజ్ తర్వాత మహేష్ - సుకుమార్ కాంబో ఫైనలైజ్ అయింది. కానీ కథ విషయం ఇంకా ఫైనల్ కాలేదని వార్తలు వస్తూనే ఉన్నాయి. సుకుమార్ చెప్పిన కథ మహేష్ కు నచ్చక పోవడంతో మరో కథ రెడీ చేస్తున్నాడని అన్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు కు సుకుమార్ మరో కొత్త లైన్ వినిపించాడట. ఇదో క్రైమ్ థ్రిల్లర్ స్టొరీ అని.. మహేష్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందని.. దీంతో మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సూపర్ స్టార్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సుకుమార్ ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డాడట. 'మహర్షి' షూటింగ్ జనవరి నెలాఖరుకల్లా కంప్లీట్ అవుతుంది. ఆ లోపు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తానని సుకుమార్ చెప్పాడట. ఇప్పుడు స్టొరీ లైన్ లాక్ అయింది కాబట్టి స్క్రిప్ట్ రెడీ చేసేందుకు రెండు నెలల సమయం సరిపోతుంది. అంటే 'మహర్షి' రిలీజ్ కు ముందే షూటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట.
Recent News