- Home
- News
- సూపర్ స్టార్ తో క్రేజీ దర్శకుడు
సూపర్ స్టార్ తో క్రేజీ దర్శకుడు
18 Dec,2018
తమిళ స్టార్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రం ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 250కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత మురుగదాస్ ,సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మురుగదాస్ వాటిని ధ్రువీకరించారు. అయితే ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఇక రజినీ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పెటా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత రజినీ, మురుగదాస్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నారు.
Recent News