సూర్యకాంతంలా మారిన నిహారిక

18 Dec,2018

ఇటీవల ‘హ్యాపీ వెడ్డింగ్’ తో ప్రేక్షకులముందుకు వచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆ చిత్రం తో కూడా విజయాన్ని అందుకోలేక పోయింది. ఇక తాజాగా ఆమె ‘సూర్యకాంతం’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈచిత్రంలో యువ హీరో రాహుల్ విజయ్ నిహారిక కు జోడీగా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదలచేశారు. లీడ్ పెయిర్ తో రూపొందిన ఈ పోస్టర్ ఆకట్టుకుంది. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈచిత్రం విడుదలకానుంది.

Recent News