విజయంలో హుషారు టీమ్

18 Dec,2018

తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా  బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు.  డిసెంబర్‌ 14న ప్రేక్షకులై మంచి హిట్ టాక్ తో రన్ అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ  సందర్భంగా... నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''నేను ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మాట్లాడినప్పుడు 'హుషారు' సినిమా మంచి సక్సస్‌ కావాలని కోరుకున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్‌ అయింది. విడుదలైనరోజు కంటే తరువాతి రోజు నుండి ఈ సినిమా కలక్షన్స్‌ పెరగడం సంతోషంగా అనిపించింది. ఇదంతా కేవలం ప్రేక్షకుల మౌత్‌టాక్‌తోనే జరిగింది. అలాగే ఈ సినిమా చూసిన యూత్‌ అందరూ సినిమాని సపోర్ట్‌ చేద్దాం అని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో పోస్ట్‌ చేయడం, మీడియా మంచి సపోర్ట్‌ ఇచ్చింది. వెబ్‌ సైట్స్‌ లలో పాజిటివ్‌ రివ్యూ లు కూడా పెట్టి మంచి రేటింగ్స్‌ ఇవ్వడం ద్వారా ఈసినిమా ఇంత మంచి హిట్‌ అయింది. రోజురోజుకి కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. అందరూ కొత్త నటీనటులు ,కొత్త టెక్నిషన్స్‌తో చేసినప్పటికీ సినిమా మంచి హిట్‌టాక్‌ తెచ్చుకుంది. చిన్న సినిమాలకు నావంతు సహాకారం అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సక్సస్‌మీట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. 'హుషారు' సినిమాని సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.'' అన్నారు. హీరో మాట్లాడుతూ - ''మా 'హుషారు' సినిమాను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్‌హిట్‌ చేసిన ప్రేక్షకులకు నా క తజ్ఞతలు. మా ఫ్రెండ్స్‌ అందరూ ఫోన్‌ చేసి విషెస్‌ తెలుపుతున్నారు. మొదటి నుండి మా టీం అందరం ఇది మా సినిమా కాదు ప్రేక్షకుల సినిమా అని చెప్పాము. అలాగే ప్రేక్షకులు ఈ సినిమాను హిట్‌ చేశారు. ఫ్రెండ్‌షిప్‌కి మంచి ఇంపార్టెన్స్‌ ఉన్న సినిమా కాబట్టి అందరూ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. మంచి సినిమాకు ప్రేక్షకుల సపోర్ట్‌ ఉంటుంది అని మరోసారి రుజువయింది'' అన్నారు. 
హీరోయిన్‌ ప్రియావడ్లమాని మాట్లాడుతూ - ''మా సినిమా సక్సస్‌ అయిందన్న ఫీల్‌ వేరే విధంగా ఉంది. చాలా రోజుల కష్టం ఇవ్వాళ మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. మా సినిమా ఇంకా ప్రేక్షకులకి దగ్గరవుతుందనే నమ్మకం ఉంది. వెదర్‌ కూడా చాలా బాగుంది. మేము థియేటర్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూసి క్రేజీగా ఫీల్‌ అయ్యాము. పాప్‌కార్న్‌ సమోసాతో మా సినిమా ఇంకా బెస్ట్‌గా ఉంటుంది'' అన్నారు. 

Recent News