ఆరుగురు భామాలతో నాచురల్ స్టార్

18 Dec,2018

నాని ప్రస్తుతం గౌతమ్ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. దాంతో పాటు ‘మనం’ ఫేమ్  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇటీవలే ఆ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చిత్రీకరణకు రంగం సిద్దం అవుతోంది. మహిళల సమస్యలపై ఈ చిత్రం స్టోరీ లైన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఆసక్తికర వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్ ఉంటారట. ఆరుగురిలో ఒక హీరోయిన్ తో నాని రొమాన్స్ చేస్తాడని మిగిలిన అయిదుగురు హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు మరియు మహిళ సాధికారత గురించిన సీన్స్ లో వారు కనిపించే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు ఒక్కరితో మాత్రమే నటించిన నాని చాలా అరుదుగా మాత్రమే తన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ తో నటించాడు. అయితే ఈసారి ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి.  ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

Recent News