జనవరి నుండి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా

18 Dec,2018

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు మంచి ఫలితాలను దక్కించుకున్నాయి. దాంతో వీరిద్దరి కాంబోలో రూపొందబోతున్న మూవీ ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పైగా దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా అరవింద సమేత తో బారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ తర్వాత చేయబోతున్న మూవీ అల్లు అర్జున్ తోనే అని ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. అయితే స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ లోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపాల్సి ఉంది. కాని అనూహ్యంగా ఈ చిత్రం వాయిదాలు పడుతూ వచ్చింది. తాజా  సమాచారం ప్రకారం స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చిందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. జనవరిలో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసి ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తో కలిసి అల్లు అరవింద్ కూడా నిర్మించబోతున్నాడట.

Recent News