- Home
- News
- మూడు భాషల్లో వై ఎస్ యాత్ర
మూడు భాషల్లో వై ఎస్ యాత్ర
18 Dec,2018
జననేతగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయెపిక్ ని తెరకెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికులు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... మడమతిప్పని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి పాత్రలో మలయాలీ మెగాస్టార్ మమ్ముట్టి గారు నటిస్తున్నారు. మమ్ముటి గారు ప్రజానాయకుడు వై ఎస్ ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారని నిస్సందేహంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన యాత్ర మెదటి లుక్ కి, టీజర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
ఆంధ్రపద్రేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, రాజకీయ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా వైఎస్ ఆర్ అభిమానులుతో పాటు సాధరణ సినిమా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటుందని మా బృందం భావిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగుతో పాటు ఫిబ్రవరి 8న తమిళ, మళయాలంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అని అన్నారు.
Recent News