సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్ వండర్ '2.0'. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ - ''రోబో విడుదలై ఎనిమిదేళ్లు అవుతుంది. ఆ సినిమా ఆడియో సమయంలో శంకర్‌గారు నాకు తెలుగు తెలియదని చెప్పి ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడు ఆయన చాలా చక్కగా తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలుగు జనాలు చాలా మంచివాళ్లు. వాళ్లని అందరూ ఇష్టపడతారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్ ఆనందమైంది. తెలుగు గొప్పతనాన్ని మహాకవి భారతీనే కొనియాడారు. తెలుగు అమ్మాయిలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోబోను చేసినప్పుడు పూర్తి సినిమాను త్రీడీగా మార్చాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఓ రీల్‌ను త్రీడీలో మార్చి చూసిన తర్వాత శంకర్‌గారు అప్పుడే త్రీడీలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకని మంచి కథ కోసం వెయిట్ చేశారు. మూడు నాలుగేళ్ల ముందు త్రీడీల సినిమా చేద్దామని అనగానే మంచి కథ దొరికేసిందని అనుకున్నాను. ఆయనతో నేను పనిచేసి ఉన్నాను కాబట్టి ఇది సాధ్యమా? అనే సందేహం రాలేదు. బాహుబలి అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మంచి సబ్జెక్ట్ అందుకు తగిన బ్రహ్మాండం. రెండు కలిసింది కాబట్టే బాహుబలి పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమా విషయానికి వస్తే టెక్నాలజీ, త్రీడీ కరెక్ట్ అయిన సబ్జెక్ట్ కాంబినేషన్ కుదిరింది. 100శాతం సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది. శంకర్‌గారు అడిగినవన్నీ సమకూర్చిన నిర్మాత సుభాష్‌కరణ్‌గారికి థాంక్స్. ఈ సినిమాకు ప్రమోషనే అక్కర్లేదు. ప్రసాద్‌గారు ఊరికే డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఆల్ రెడీ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడొస్తుందా? అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత.. చూసినవాళ్లే సినిమాను ప్రమోట్ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పాను. 1975లో నేను నటించిన తొలి చిత్రం అపూర్వరాగంగల్ సినిమాను చూడాలని ఎంత ఉబలాటపడ్డానో.. 43ఏళ్ల తర్వాత 2.0 కోసం అంతే అతృతగా ఉంది. ఇందులో 45 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మేకింగ్, ట్రైలర్‌లో, సాంగ్స్‌లో చూసినవన్నీ శాంపిల్సే. ఇది ట్రైలర్ మాత్రమే. మీరు ఆశ్చర్యపోయేలా గ్రాఫిక్స్, బ్రహ్మాండం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. '2.0' మన సినిమా ఇండస్ట్రీకే చాలా గర్వ పడే చిత్రం. శంకర్‌గారు చెప్పినట్లు ఈ సినిమాను త్రీడీలో చూస్తే ఆ ఎఫెక్టే మరోలా ఉంటుంది. నేను కూడా 29 కోసం వెయిట్ చేస్తున్నాను'' అన్నారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ - ''2.0' నాకు సినిమా కాదు. ఓ స్కూల్‌కు వెళ్తున్నట్లుగా భావించాను. మా స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్‌గారు. నేను సినిమా ఇండస్ట్రీలో 28 సంవత్సరాలుగా ఉన్నాను. ఇన్నేళ్లలో నేర్చుకోలేని చాలా విషయాలను ఈ సినిమాలో నేర్చుకున్నాను. ఇలాంటి సినిమాలో బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారితో కలిసి పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన శంకర్‌గారికి థాంక్స్. ఓ సింపుల్ లైన్ ఇస్తే దాని నుండి మేజిక్ చేయడం రజనీకాంత్‌గారికే తెలుసు. ఈ సినిమాలో విలన్‌గా నటించాలని అనగానే ఆయనతో దెబ్బలు తినడాన్ని ఓ గౌరవంగా భావించాను. ఈ సినిమాలో ఆయనతో దెబ్బలు తినడమే నాకు బెస్ట్ మూమెంట్స్. నేను ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేశాను. నేను కూడా సినిమాను చూడలేదు. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సుభాష్ కరణ్‌గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా చేసిన సుభాష్‌కరణ్‌గారికి థాంక్స్'' అన్నారు.
శంకర్ మాట్లాడుతూ ''ఇలా నడిస్తే ఎలా ఉంటుంది? అనే ఓ ఇమాజినేషనే ఈ '2.0' సినిమా. ఇది ఒక ఫుల్ యాక్షన ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్. ఇందులో మంచి ఎమోషనల్ సోషల్ స్టోరీ ఉంది ఇందులో. ఇది ఒక టీమ్ వర్క్. వేలాదిమంది టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ఆర్టిస్టుల విషయానికి వస్తే రజనీగారు, అక్షయ్‌గారు, ఎమీ జాక్సన్..ఇలా చాలా మంది కష్టపడి చేశారు. క్లైమాక్స్‌ని ఢిల్లీలో షూట్ చేశాం. 47 డిగ్రీల టెంపరేచర్‌లో చేయడం జరిగింది. రజనీగారు ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు. అక్కడికి రావడం చాలా కష్టం. 40 రోజులు షూటింగ్. అక్షయ్‌కుమార్‌గారు, ఫారిన్ టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు అందరూ 500 మంది వెయిట్ చేస్తున్నాం. ఆ షూటింగ్ క్యాన్సిల్ చేస్తే చాలా నష్టం జరుగుతుంది. అందరినీ 40 రోజుల కోసం అక్కడికి తీసుకురావాలంటే చాలా కష్టం. ఇవన్నీ ఆలోచించిన రజనీగారు తన హెల్త్ కండీషన్ బాగుండకపోయినా అక్కడికి వచ్చి క్లైమాక్స్ కంప్లీట్ చేశారు. అక్షయ్‌గారు ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో ఇలాంటి మేకప్ వేసుకోలేదు. టోటల్ కెరీర్ మేకప్ ఈ ఒక్క సినిమాలోనే వేసేశారు. రెండున్నర, మూడు గంటలపాటు ప్రాస్తటిక్ మేకప్, విగ్, లెన్స్, పళ్ళు... ఇవన్నీ వేసుకొని చాలా బాగా పెర్‌ఫార్మ్ చేశారు. ఇక రెహమాన్ గురించి చెప్పాలంటే సినిమాలోని సీన్స్ హెవీగా ఉన్నాయని బాగా చెయ్యాలన్న ఉద్దేశంతో 6 నెలల ముందే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశారు. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తే బ్యాట్‌మేన్, స్పైడర్‌మేన్‌లాంటి సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగేలా చాలా బాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ క్రెడిట్స్ మెయిన్‌గా నిర్మాత సుభాస్కరన్‌గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇండియన్ సినిమాకి ఇంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఎవ్వరూ చెయ్యరు. కానీ, సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సీక్వెల్‌లో మళ్లీ సైంటిస్ట్ వశీకరన్‌గారు, చిట్టీ, 2.0... వీళ్ళందరినీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఆ ఎక్సైట్‌మెంట్ మీక్కూడా వస్తుందని నమ్ముతున్నాను. నేను మీడియా వారందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇలాంటి సినిమాలను సపోర్ట్ చెయ్యండి. ఈ సినిమా కోసం అందరూ టన్నుల కొద్దీ ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తే మన కంట్రీలో కూడా ఇలాంటి సినిమాలు చెయ్యవచ్చు అని వరల్డ్‌కి ప్రూవ్ చెయ్యవచ్చు. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న ఎన్.వి.ప్రసాద్‌గారికి థాంక్స్. ఈ సినిమాని 3డిలో చూడండి. 2డి కంటే 3డిలో పదిరెట్లు బాగుంటుంది'' అన్నారు.