దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సినీ నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేసారు. చింతమనేని తమకు నరకం చూపిస్తున్నాడని, మరోసారి అయన ఎమ్మెల్యే అయితే ఇక్కడున్న తమ ఆస్తులను అమ్ముకుని తెలంగాణ కు వెళ్లిపోతామని చెప్పారు. తాము కూడా కమ్మ సామజిక వర్గానికి చెందిన వారిమే అయినప్పటికీ నాకు కుల పిచ్చి లేదని తెలిపింది. మొదటి నుండి తాము టిడిపి కె ఓటు వేస్తామని .. కానీ ఈ సారి ఆ ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలని కోరుకుంటున్నానని తెలిపింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అపూర్వ తెలిపింది. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోడంతో సినిమాల్లో నటించడం లేదని .. తెలిపింది.