వినాయక్ తో బాలయ్య సినిమా లేనట్టే 

24 Nov,2018

మాస్ దర్శకుడూ వినాయక్ పరిస్థితి అయోమయంలో పడింది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన ఖైదీ నంబర్ 150 సినిమా సంచలన విజయం అందుకున్నా ఆ క్రెడిట్ మాత్రం వినాయక్ కు దక్కలేదు. ఆ ఆసినిమా తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఇంటిలిజెంట్ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా ప్లాప్ తరువాత వినాయక్ కు నెక్స్ట్ సినిమా మాత్రం దక్కలేదు. ఇప్పటికే బాలకృష్ణ తో ఓ సినిమాకు ప్లాన్ జరిగింది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమా సెట్ చేసాడు ... కానీ బాలయ్యకు నచ్చిన కథను మాత్రం వినాయక్ చెప్పడం లేదట. ఇప్పటికే పలుమార్లు కథా చర్చలు జరిగినా కూడా బాలయ్యను ఒప్పించలేదు. బాలయ్య ఇప్పటికే నందమూరి తారక రామారావు బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు .. కాబట్టి ఇప్పట్లో వినాయక్ తో సినిమా లేనట్టే. 

Recent News