సర్కార్  బాక్స్ ఆఫీస్ కలక్షన్స్ 

24 Nov,2018

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచుకున్నప్పటికీ తెలుగులో మాత్రం యావరేజ్ గా నిలిచింది. సరైన కథ, కథనం లేకపోవడం .. ముక్యంగా మురుగదాస్ శైలి సినిమా కాకపోవడంతో అయన ఫాన్స్ ఈ సినిమా విషయంలో తీవ్ర నిరాశ పడ్డారు. అయితే విజయ్ సర్కార్ విడుదల అయిన సమయం బాగా ఉన్నట్టుంది .. అందుకె ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లు అందుకోవడం విశేషం. మొత్తానికి విజయ్ కి తెలుగులో ఈ మద్యే తుపాకీ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు .. అయితే మార్కెట్ పరంగా మాత్రం ఇంకా పెరగాల్సి ఉంది .. దాంతో సర్కార్ సినిమా విషయంలో భారీ హిట్ ఊహించారు కాదు దానికి రివర్స్ గా ఫలితం దక్కింది. మొత్తానికి సర్కార్ క్లోజింగ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం .. నైజాం - 2. 59 కోట్లు, సీడెడ్ - 1. 93 కోట్లు, ఉత్తరాంధ్రా - 0. 93 కోట్లు, ఈస్ట్ - 0. 62 కోట్లు, వెస్ట్ - 0. 48 కోట్లు, కృష్ణా - 0. 70 కోట్లు, గుంటూరు - 0. 88 కోట్లు, నెల్లూరు - 0. 34 కోట్లు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8. 46 కోట్లు. 

Recent News