ట్రిపుల్ ఆర్ సెట్ ఫొటోస్ లీక్ 

23 Nov,2018

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టి స్టారర్ ట్రిపుల్ ఆర్. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో వేసిన సెట్ లో ఈ నెల 19నుండి జరుగుతుంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఫోర్ డి టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు సూపర్ స్టార్స్ లతో తీస్తున్న సినిమా కాబట్టి అదే రేంజ్ లో సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం వేసిన సెట్ తాలూకు ఫోటోలు లీక్ అయ్యాయి. ఇది కావాలని లీక్ చేసారా .. లేదా అన్నది తెలియాల్సి ఉంది. దాదాపు నెలరోజుల పాటు మొదటి షెడ్యూల్ ని జరిగి ఆ తరువాత కొంత బ్రేక్ తీసుకుని ఆ తదుపరి షెడ్యూల్ ని విదేశాల్లో చిత్రీకరిస్తారట. అన్నట్టు ఈ సినిమాకోసం రాజమౌళి మరో కొత్త తరహా భాషను ప్రవేశ పెట్టనున్నాడట. ఇదివరకు బాహుబలి లో కిలికిలి భాషను పెట్టినట్టు గా అన్నమాట.  డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్స్ ఎవరన్నా విషయం పై త్వరలోనే క్లారిటీ రానుంది. 

Recent News