క్షేమంగానే ఉన్నామంటున్న రాజశేఖర్ 

23 Nov,2018

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రస్తుతం కల్కి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ కులు మనాలిలో ప్లాన్ చేశారు. కులుమనాలికి వెళుతున్న ఈ టీమ్ జర్నీ లో ఉన్నట్టుండి రోడ్డుపై కొండా చరియలు విరిగి పడ్డాయట .. దాంతో రాజశేఖర్ కు గాయాలు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే .. ఈ విషయం పై రాజా శేఖర్ స్పందించాడు. రోడ్డుపై కొండా చరియలు విరిగి పడ్డాయని .. అయితే ఎవరికీ ఏమి కాలేదని రాజశేఖర్ ట్విట్టర్ లో తెలిపాడు. ఈ సంఘటన వల్ల కొంత ఆలస్యం అయిందని .. అయినా మా ప్రయాణం మళ్ళి మొదలైందని తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసిమెప్పటినుండి చాలా మంది ఫ్రెండ్స్, బంధువులు ఫోన్స్ చేస్తున్నారని .. తాము అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపాడు రాజశేఖర్.  

Recent News