సూపర్ స్టార్ రజని కాంత్, క్రేజీ దర్శకుడు శంకర్ ల కలయికలో వస్తున్న రోబో 2. ఓ సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా 3డి లో కూడా విడుదల కానుంది. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే కాకుండా చాలా భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో కుడా సంచలనం రేపిన 2.ఓ మెయిన్ టార్గెట్ బాహుబలి. బాహుబలి సినిమాను మించే సక్సెస్ కోసం శంకర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా 6,800 థియేటర్స్ లో విడుదల చేస్తుండడం విశేషం. 3డి టెక్నాలజీ, 4డి సౌండ్ లాంటి లేటెస్ట్ టెక్నీకల్ అంశాలతో వస్తున్నా ఈ సినిమా ఎలాంటి సంచలనం రేపనుందో చూడాలి.